ETV Bharat / state

సచివాలయ ఉద్యోగాల్లో ప్రలోభాలకు లొంగొద్దు: కలెక్టర్

సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. పూర్తి పారదర్శకంగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని వెల్లడించారు.

author img

By

Published : Aug 26, 2019, 3:16 PM IST

సచివాలయ ఉద్యోగాలు పూర్తిపారదర్శకంగా జరుగుతాయి
సచివాలయ ఉద్యోగాలు పూర్తిపారదర్శకంగా జరుగుతాయి

సచివాలయ ఉద్యోగాల కోసం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 481 పరీక్ష కేంద్రాల్లో 2లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం జరిగే పరీక్షకు అత్యధికంగా లక్ష 25వేల మంది హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని, అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. .

ఇదీ చూడండి

మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

Intro:AP_SKLM_22_26_enti sthalau_kosam_kvps_dharna_av_AP10139

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని లావేరు మండలం అదపాక గ్రామానికి చెందిన రెల్లి కులస్తులు జిల్లా కెవిపిఎస్( కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ) ఆధ్వర్యంలో సోమవారం 42 కుటుంబాలకు చెందిన రెల్లి కులస్తులు గృహ నిర్మాణాల కోసం పొజిషన్ సర్టిఫికేట్( నివాస స్థల ధ్రువీకరణ పత్రం) మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేసినప్పటికీ నివాస స్థల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఇల్లు కట్టుకోలేకపోయామని వాపోయారు. జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడుతూ 1980లో రెల్లి కులస్తులకు ఇళ్ల స్థలాల కోసం రెండు ఎకరాల స్థలం మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేవలం రాజకీయంగా కక్షసాధింపు కోసమే ఇళ్ల స్థలాలకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం తాసిల్దార్ ఎస్.రమణయ్యకు వినతిపత్రం అందించారు. తాసిల్దార్ మాట్లాడుతూ గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తెలిపారు.

Body:రెల్లి కులస్తుల ఆందోళన

Conclusion:రెల్లి కులస్తుల ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.