తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఇక్కడ నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వలస కార్మికులను ఉంచగా వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు, భౌతికదూరం పాటించటంపై పలు సూచనలు చేశారు. తుని పట్టణంలో కరోనా అనుమానితుల శాంపిల్స్ సేకరించే కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీచదవండి