వరద ముంపునకు గురైన లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుంటామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించి వరద బాధితులను పరామర్శించారు.
ముందుగా కలెక్టర్ ఐ.పోలవరం మండలం మురమళ్ళ ఏటిగట్టు వద్ద వున్న పుష్కరఘాట్‌ను, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని గ్రామాలను సందర్శించారు. వరద బాధితులకు అందుతున్న భోజన వసతి, వైద్య సహాయం తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: