తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం-సామర్లకోట రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న పురాతన వంతెన కూలిపోయింది. గ్రావెల్ లోడ్‌తో లారీ వెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కూలింది. ఫలితంగా ఆ లారీ ఏలేరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సామర్లకోట-పిఠాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇదీ చూడండి: