ముఖ్యమంత్రి జగన్.. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఏర్పాటు చేసిన గ్రాసిం పరిశ్రమను జగన్ ప్రారంభిస్తారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10:50 నిమిషాలకు గ్రాసిం పరిశ్రమ వద్దకు చేరుకుంటారు. సీఎం జగన్ చేతుల మీదుగా గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభం కానుంది. అనంతరం 12: 30కి హెలికాఫ్టర్లో తాడేపల్లి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో ఏర్పాటుకానున్న అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్ ఇది. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో పరిశ్రమ ఏర్పాటు చేశారు. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పనకు పరిశ్రమ అంగీకారించడంతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి పొందనున్నారు.
సీఎం పర్యటన పేరిట పోలీసుల ఓవరాక్షన్
సీఎం జగన్ పర్యటన పేరిట ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వినుకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ కారును స్వాధీనం చేస్తుకున్నారు. దీంతో మహిళలు, పిల్లలతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చదవండి: Cm Jagan: బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్ జిల్లాల పర్యటన