ఐదేళ్ల తెదేపా పాలనలో అందరూ సంతృప్తిగా ఉన్నారని.. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛను 3వేలు, పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తానన్నారు. ఐటీ దాడులు చేయడం, అధికారులను మార్చటం చేస్తున్నారని సీఎం అన్నారు. జగన్పై మోదీ ఈగ కూడా వాలనివ్వరని..ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. విజయ్ మాల్యా అరుణ్ జైట్లీకి చెప్పి మరీ లండన్ వెళ్లారన్నారు. జగన్ తమ మిత్రుడని పీయూష్ గోయల్ అన్నారని సీఎం చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ ఎలా చేరతారని ప్రశ్నించారు. జగన్ ద్వారా ఏపీ పై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇవి చూడండి...