ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. యానాంలో వస్త్ర దుకాణాలు బంద్

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో 15 రోజుల పాటు వస్త్ర దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు వస్త్ర వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావం పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వస్త్ర వ్యాపారులు తెలిపారు.

cloths shops close in ayanam
యానాంలో మూతపడిన వస్త్ర దుకాణం
author img

By

Published : Sep 3, 2020, 10:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కరోనా వ్యాధిా బారినపడిన వారి సంఖ్య 1000కి చేరువయ్యింది. ఊహించని స్థాయిలో ప్రజలు ఈ మహమ్మారికి బారినపడుతున్నారు. ఈ క్రమంలో వస్త్ర వ్యాపారులు 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రకటించారు. రెడిమేడ్ మొదలుకొని అన్ని రకాల బట్టల దుకాణాలు మూతపడ్డాయి. ఈ ఏడాది మార్చి 24 నుంచి జూన్ నెలాఖరు వరకు పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాల మేరకు షాపులు తెరవలేదు.

పండుగ సీజన్.. వివాహాలు ఉన్న కారణంగా జులై, ఆగస్టు నెలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే వ్యాపారాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అన్ని రకాల నివారణ చర్యలు తీసుకున్నా… కొనుగోలుదారుల రాకపోకలు పెరగిన ఫలితంగా షాపు యజమానులతో పాటు పనిచేసే సిబ్బంది సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా వస్త్ర వ్యాపారులంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.