ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ స్ఫూర్తితో అన్నవరంలో పర్యావరణహిత సంచుల పంపిణీ

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ వినియోగంపై చేస్తున్న పలు కార్యక్రమాల స్ఫూర్తితో అన్నవరం గ్రామానికి చెందిన ఓ దాత గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు పర్యావరణహిత సంచులను అందించారు.

cloth bags distributed in annavaram
author img

By

Published : Nov 13, 2019, 3:48 PM IST

ఈనాడు-ఈటీవీ స్ఫూర్తితో అన్నవరంలో పర్యావరణహిత సంచుల పంపిణీ

పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టేందుకు ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ స్ఫూర్తితో అన్నవరం గ్రామానికి చెందిన ఓ దాత గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు పర్యావరణహిత సంచులు అందించారు. అన్నవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రవి ఆయన కుమారుడు వంశీకృష్ణ పేరు మీద వీటిని సిద్ధం చేశారు. ఈ బ్యాగుల పంపిణీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, దేవస్థానం ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు, డీఎస్పీ శ్రీనివాసు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం స్వామివారి గిరి ప్రదక్షిణ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పండ్లు పంపిణీ వద్ద భక్తులకు సంచులను అందించారు.

ఇదీ చూడండి: 'విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ఈనాడు-ఈటీవీ సదస్సు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.