Chittila Fraud in Undrajavaram: చిట్టీల పేరుతో 20 సంవత్సరాలుగా నమ్మకంగా వ్యాపారం చేస్తూ.. సుమారు కోటి రూపాయలతో వ్యాపారి ఉడాయించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కలకలం రేపింది. అతన్ని నమ్మి..లక్షల్లో చిట్టీలు వేసిన మహిళలు, స్నేహితులు, బంధువులు కన్నీంటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఉండ్రాజవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిట్టీల వ్యాపారి కుంట్ల మోహన్ రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Undrajavaram SI Rama Rao on Chittila Fraud: బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ''మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామం ముత్యాలమ్మపేటలో కుంట్ల మోహన్ రావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గత 40 సంవత్సరాలుగా అతను దర్జీగా పని చేస్తూ.. చీట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. దీంతో అతన్ని నమ్మి.. చుట్టు పక్కల స్థానికులు, బంధువులు, స్నేహితులు లక్షల్లో చిటీలు కట్టారు. చిట్టీలతో పాటు ప్రామిసరీ నోట్లపై అప్పులు ఇచ్చారు. మరికొంతమంది ఆస్తులు తనఖా పెట్టుకుని మరీ అప్పులు ఇచ్చారు. అతని బంధువులు సైతం నగదు, బంగారు నగలను అప్పుగా పెట్టుకోవడానికి ఇచ్చారు. అయితే, ఆ వ్యాపారి చిట్టీల రూపంలో సుమారు 35 మందికి 35 లక్షల రూపాయల వరకు బాకీలు పడ్డాడు. తాజాగా కోటి రూపాయలతో పరారయ్యాడు.'' అని ఉండ్రాజవరం ఎస్సై రామారావు ఘటన వివరాలను వెల్లడించారు.
Retd Headmaster Chits Fraud: నమ్మి ఇస్తే నట్టేట ముంచాడు.. లబోదిబోమంటున్న బాధితులు
SI Rama Rao Comments: అంతేకాకుండా, వ్యాపారి కుంట్ల మోహన్ రావు వద్దనున్న ప్రామిసరీ నోట్లు, తనఖా బాకీలు.. సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని భావిస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మోహనరావుతోపాటు అతని భార్య, కుమారుడు, కుమార్తె, అల్లుడుపై కూడా కేసు నమోదు చేశామన్నారు. వారు కూడా అతనితోపాటు చిట్టీలు వసూలు చేసే వారని బాధితులు ఫిర్యాదులో వెల్లడించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Chitti Fraud: చిట్టీల పేరుతో కోట్లకు కుచ్చుటోపి.. రాత్రికి రాత్రే ఉడాయింపు..
Victims Comments on Chitty Fraud: ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమ అవసరాలకు పనికొస్తాయని ఎంతో కష్టపడి చిట్టీలు కట్టుకుమన్నారు. నమ్మకంగా ఉంటూ.. తమ నెత్తిన టోపీ పెట్టి పరార్యయాడని ఆవేదనకు గురయ్యారు. అప్పులు ఇచ్చిన వాళ్లకి నమ్మకంగా ఉంటూ.. మోసగించి పారిపోయాడని కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.