ETV Bharat / state

'లాక్​డౌన్ ఉల్లంఘించిన వైవీ సుబ్బారెడ్డిపై చర్యలేవీ?' - మద్యం రెట్లు పెంపుపై చినరాజప్ప కామెంట్స్

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నివాసయోగ్యానికి పనికిరాని భూములకు రెట్టింపు రేట్లు కట్టబెట్టేందుకు వైకాపా నేతలు అధికారులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఆదాయం పెంచుకోడానికి మద్యం రేట్లు పెంచారని ఆరోపించారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నా వైవీ సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి ఇతర రాష్ట్రం నుంచి ఎలా వస్తారని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప
మాజీ మంత్రి, తెదేపా నేత చినరాజప్ప
author img

By

Published : May 4, 2020, 11:21 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే ఇళ్ల స్థలాలకు భూములు సేకరణ పేరుతో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ, రాజానగరం నియోజకవర్గాలలో లోతట్టు ప్రాంతాలను ఇళ్ల స్థలాలకై భూములు సేకరిస్తున్నారని, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నివాసయోగ్యానికి పనికిరాని భూములకు రెట్టింపు రేట్లు చెల్లిస్తున్నారన్నారు. ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలనుకున్న మడ అడవుల భూములకు కేంద్రం అడ్డుకట్టవేసిందన్నారు.

ఆదాయం కోసమే మద్యం రేట్లు పెంచి అమ్మడానికి అనుమతి ఇచ్చారని చినరాజప్ప ఆక్షేపించారు. మద్య నిషేధం విధానమని చెప్పిన వైకాపా దానిపై ఆదాయానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. సేల్స్ టాక్స్ పోయినందున ఆదాయం కోసం లాక్​డౌన్​లోనే దుకాణాలు తెరవాలని తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు.

తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వైవీ సుబ్బారెడ్డి ఇతర రాష్ట్రం నుంచి ఎలా వస్తారని ప్రశ్నించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎలా దర్శనం చేసుకుంటారన్న చినరాజప్ప...ఆయనపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలన్నారు. ప్రజలకో న్యాయం , వైకాపా నేతలకో న్యాయమా అని నిలదీశారు. మీడియా గొంతు నొక్కడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని చినరాజప్ప ఆక్షేపించారు.

ఇవీ చూడండి : అమ్మకు నాన్నై అన్నం పెట్టే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.