ETV Bharat / state

'రాజధానుల పేరిట రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా..?' - gorantla buchayya on capital issue

అమరావతిలో రాజధాని ఏర్పాటు సమిష్టి నిర్ణయమని తెదేపా నేతలు  చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి అన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరితో చర్చించాకే... రాజధాని ప్రకటించామని గుర్తు చేశారు. అభివృద్ధికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతో అమరావతిని నిర్మించే ప్రయత్నం చేస్తే... వైకాపా రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

chinarajappa criticizes 3 cpatial comments on jagan
తెదేపా నేతలు  చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి
author img

By

Published : Dec 19, 2019, 9:21 PM IST

మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేతలు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి

విభజన అనంతరం రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రాజధాని అవసరమన్న ఆలోచనతోనే అమరావతి నిర్మాణం చేపట్టామని మాజీమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో సచివాలయం, శాసనసభ, కోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టామన్న ఆయన... రాజధాని ఏర్పాటుకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం.. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.

శాసనసభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులపై చేసిన ప్రకటన.. ప్రజల్ని ఆందోళనకు గురిచేసిందన్నారు. గత ప్రభుత్వంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. వైకాపా తీరు రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఆవేదన చెందారు. రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్న ఆయన.. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో వికేంద్రీకరణ జరగాలి కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేలా కాదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

రాజధాని రైతుల ఉద్యమ బాట.. జేఏసీ ఏర్పాటు

Intro:AP_RJY_86_19_APRajadani_Pai_Chennarajappa_AVB_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)

East Godavari.

( ) అమరావతి లో సచివాలయం, శాసనసభ, కోర్టు, అనేక నిర్మాణాలు రాజధాని నిర్మాణం చేశామని కొత్త రాష్ట్రంలో ఒక రాజధాని అవసరమని అనేక మంది తో చర్చించి ఒక రాజధానిని ప్రకటించడం జరిగిందని మాజీ హోంమంత్రి చిన్నారాజప్ప అన్నారు. రాజధాని పై ఈ ప్రభుత్వం బొత్స సత్యనారాయణ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది. మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలు పై చేసిన ప్రకటన చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం లో ఆర్ధిక రాజదాని గా విశాఖపట్నం అభివృద్ధి గా తయారు చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి రైతులను, పెట్టుబడి పెట్టే వారిని ఇబ్బంది పెడుతున్నారని రాజధాని విషయంలో రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని మాజీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా ప్రభుత్వం ఉందని ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని అన్నిటికీ అనువైనది అమరావతిని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి జరగాలి కానీ ముక్కలు చేస్తారాని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అన్నారు

Body:AP_RJY_86_19_APRajadani_Pai_Chennarajappa_AVB_AP10023

Conclusion:AP_RJY_86_19_APRajadani_Pai_Chennarajappa_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.