ETV Bharat / state

'కుట్రలు, కుతంత్రాలతో వైకాపా పాలన' - పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో పాలన సాగుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో వైకాపా శ్రేణులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వాటిని మానుకోవాలని చినరాజప్ప తెలిపారు.

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
author img

By

Published : Jun 29, 2019, 1:35 PM IST

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగుతోందని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా శ్రేణులపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన.. జగన్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నక్యాంటీన్లు, శిలాఫలకాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి భద్రతల సమస్యపై డీజీపీని కలవబోతున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వీలైతే క్రమబద్ధీకరించాలే తప్ప.. భవనాలను ధ్వంసం చేయడం సరికాదని హితవు పలికారు. తెదేపా ఓ విశ్వ విద్యాలయంలాంటిదని... ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
హిందూ ధర్మ పరిరక్షణకు ఏపీ సాధు పరిషత్​ డిమాండ్

Intro:AP_RJY_56_29_VENKANNA SWAMY_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికిరెడ్డి
కొత్తపేట

ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులతో కోనసీమ తిరుపతి గా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది

Body:రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచు కునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్ లు అన్ని నిండిపోయాయి

Conclusion:స్వామిని దర్శించుకునేందుకు సుమారుగా మూడు గంటల సమయం పడుతుంది వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ లు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.