తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే రాజప్ప ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరుకున్న బ్రిటిష్ కాలం నాటి.. రెవెన్యూ డివిజనల్ కార్యాలయంను.. ప్రజల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిర్మించాలనే ఉద్దేశంతో రెండున్నర కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాజప్ప తెలిపారు. ఆ వ్యయంతో పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి రాజప్ప అన్నారు.
కార్యాలయాన్ని తుది దశలో కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లింపు జరగకపోవడం.. గత సంవత్సన్నర కాలంగా విలువైన నిర్మాణన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. అదే విధంగా, మండల తహసీల్దార్ కార్యాలయంకు గత ప్రభుత్వ కోటి రూపాయలు మంజురు చేసిందన్నారు. ఆ కార్యాలయం కాంట్రాక్టర్ నిధులు చెల్లింపులో జాప్యం వలన వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పిచ్చి మొక్కలు మొలిచి.. కార్యాలయ ఆవరణ భీతిగొల్పుతుందన్నారు.
అదే విధంగా క్రీడా వికాస కేంద్రం, ఈత కొలను తదితర నిర్మాణ కోసం 4 కోట్లు కేటాయించినా.. గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టి 70% పనులు పూర్తి చేసి, ఏళ్లు కావస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. 50 కోట్ల రూపాయలతో రోడ్లకు కేటాయించి 70% శాతం పనులు పుర్తవగా.. మిగతా పనులను కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాలేదని అన్నారు. అలాగే 300 కోట్లతో ఏడీబీ రోడ్డు మంజూరు కాబడి 10-15% పనులు పూర్తి చేసి మిగిలిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి: