ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు

author img

By

Published : Jun 19, 2020, 11:57 PM IST

Updated : Jun 20, 2020, 1:56 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. 16 రోజుల పసికందును కుటుంబసభ్యులే బావిలో పడేసి చంపేశారు. ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషన్​కు వెళ్లి తమ చిన్నారి కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశారు.

child-murdered-in-chinakondepoodi-seethanagaram-mandal-eastgodavari-district

అమ్మ ఒడిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న పసికందు అంతలోనే బావిలో విగతజీవిగా కనిపించింది. ఈ విషాదం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి పంచాయతీ కొత్తూరులో జరిగింది. ముద్దులొలికే 16 రోజుల పసిబిడ్డ ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం గ్రామాన్ని విషాదభరితం చేసింది. పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.... ఆడపిల్ల కావటంతో కుటుంబసభ్యుల్లో ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

పోలీసుల వివరాల ప్రకారం... కొత్తూరుకు చెందిన కాళ్ల సతీష్ భార్య సుజాతకు 16 రోజుల కిందట మొదటి ప్రసవంలో ఆడశిశువు జన్మించింది. ఆడపిల్ల పుట్టడం కుటుంబీలకు ఇష్టంలేకపోవటంతో ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. ఈ ప్రయత్నంలో భాగంగా తొలుత పసికందును ఎవరో అపహరించారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. వారంటున్న ఇంటి పక్కనే పాడుబడిన బావిలో పసికందు మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం

Last Updated : Jun 20, 2020, 1:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.