A loud chicken race in both Godavari districts: ఉభయ గోదావరి జిల్లాల్లో మహిళలందరూ శాంతియుతంగా ఓవైపు భోగి పండుగను జరుపుకుంటుంటే.. మరోవైపు ఎప్పటి మాదిరిగానే నిర్వాకులు బరులు కట్టి, యథేచ్చగా కోడిపందేలను నిర్వహించటం ప్రారంభించారు. పోలీసులు కూడా ఎప్పటి మాదిరిగానే ఈసారి సైతం భోగి పండుగ ప్రారంభ సమయం వరకు పహారా కాసి.. పండుగ ప్రారంభమైన వెంటనే కనబడకుండా పోయారు. దీంతో కోడిపందేలరాయుళ్లు, జూదం నిర్వహకులు మరింతగా రెచ్చిపోయి బహిరంగంగానే అసాంఘిక కార్యకలపాలను కొనసాగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు భారీగానే ప్రారంభమయ్యాయి. తణుకు మండలం తేతలి దువ్వ తదితర గ్రామాలతో పాటు తణుకు పట్టణ పరిధిలో పందేలు యథేచ్చగా సాగాయి. మొదటి రోజు కావడంతో పందేల నిర్వాహకులు, పందెంరాయుళ్లు.. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేవరకు వేచి చూసి, అనుమతి రాగానే ప్రారంభించారు. అడ్డుకోవాలని పోలీసులు ఆరాటం, నిర్వహించాలన్న నిర్వాహకుల అతుత్ర మధ్యలో పందేంరాయుళ్లదే పైచేయి అయింది. మరోపక్క కోడిపందేలతో పాటు గుండాటలు, పేకాటలు, కోత ఆటలు భారీగానే సాగాయి. వేలకు వేల రూపాయలు చేతులు మారాయి. మొదట రోజు పందేలలో, పేకాటలు, గుండాటలలో జిల్లాలో దాదాపు రూ. 30 కోట్ల రూపాయల పైగా చేతులు మారుతుందని పందెం రాయుళ్లు చెప్పడం కొస మెరుపు.
ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే.. సంక్రాంతి పండుగ మొదటి రోజు కోడిపందేలు కోలాహలంగా ప్రారంభమైయ్యాయి. కోడిపందేలు పోలీసులు నుంచి అనుమతి రాగానే నిర్వాహకులు, పందెం రాయుళ్లు పందేలకు సై అంటే సై అంటూ తెర తీశారు. నిడదవోలు, ఉండ్రాజవరం పెరవలి మండలాలలో కోడిపందేలు భారీగా ప్రారంభమయ్యాయి. పోలీసులు వారిస్తున్నా పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు అనుమతి వచ్చిన మరుక్షణమే ఉరకలు వేస్తూ పందేలను ప్రారంభించారు.
నిర్వాహకులలోనూ, పందెం రాయుళ్లలోను కోడిపందాలకు అనుమతించినా.. గుండాటలు, పేకాటలు, కోత ఆటలపై పోలీసులు నిషేధం విధించటంతో నిర్వాహకులు డీలాపడ్డారు. కోడిపందేలతో పాటు గుండాటలకు అనుమతి ఉంటేనే తమకు నాలుగు రూపాయలు మిగులుతాయని, కేవలం కోడిపందేలు అవుతే కనీసం ఖర్చులు కూడా రావని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న పశ్చిమగోదావరి ఇతర జిల్లాల్లోనూ గుండాటలు యథేచ్ఛగా జరుగుతుండగా ఈ జిల్లాలో బ్రేక్ వేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి