జిల్లాలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. రంపచోడవరం, రామచంద్రాపురం, అమలాపురం, పెద్దాపురం, కాకినాడ, చింతూరు డివిజన్లలో 1687 కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన తనిఖీల్లో... జిల్లాలో లభ్యమైన 23, 476 లీటర్ల నాటుసారాను పెద్దాపురం పోలీస్ క్వార్టర్స్‌కి తరలించారు.
అనంతరం వాటిని ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 58.69 లక్షల నగదును ఉంటుందని ఎస్పీ నయీమ్ అస్మి తెలిపారు. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాటుసారా అరికట్టడంలో వివిధ శాఖల పనితీరు బాగుందని ఎస్పీ అన్నారు.
ఇదీ చదవండి: