కరోనా వ్యాధిని అరికట్టేందుకు యానాంలో డిప్యూటీ కలెక్టర్... ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి యానాం చేరుకుంటున్న విద్యార్థులపై అధికారులు దృష్టి సారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రెండువారాలపాటు కుటుంబసభ్యులకు దూరంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్షన్ 144 విధించడంతో యానాంలోని రద్దీ ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. భక్తులతో కళకళలాడే ప్రార్థన మందిరాలు వెలవెలబోతున్నాయి.
ఇదీ చదవండి : 'రమేశ్ కుమార్ లేఖ రాశారు.. కేంద్రం భద్రత పెంచింది'