తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను.. కారు వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఆటో పక్కనే ఉన్న మురికి కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరు కొత్తపేట మండలం వాడపాలెంకు చెందినవారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: