ETV Bharat / state

శిథిలావస్థకు చేరుకున్న గోరింకల మురుగు కాలువ పైవంతెన - gorinka main bridge weaken latest news

50 ఏళ్ల క్రితం గోరింకల ప్రధాన మురుగు కాలువపై నిర్మించిన బల్ల వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన జి. పెదపూడి నుంచి అవిడికి వెళ్లే మార్గంలో ఉంది. ప్రస్తుతం దీనిపై రాకపోకలను ఆర్అండ్​ బీ అధికారులు నిషేధించారు. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉన్నందున నూతన వంతెన నిర్మించాలంటూ స్థానికులు కోరారు.

bridge in danger position at gorinka main drainge canal in east godavari district
ప్రమదంగా ఉన్న గోరింకల ప్రధాన కాలువపై బల్ల వంతెన
author img

By

Published : Aug 6, 2020, 7:06 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం - కొత్తపేట నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుని అత్యంత ప్రమాదకరంగా మారింది. జి. పెదపూడి నుంచి అవిడి వెళ్లే మార్గంలో గోరింకల ప్రధాన మురుగు కాలువపై సుమారు 50 ఏళ్ల క్రితం బల్ల వంతెన నిర్మించారు. కాలక్రమేణ ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన పరిశీలించిన ఆర్​అండ్​బీ అధికారులు దీనిపై రాకపోకలను నిషేధించారు. పలువురు గత్యంతరం లేక ఈ మార్గంలో వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన పరిస్థితి బాగోలేదని… ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నూతన వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :

వంతెన కింద ఇరుక్కున్న వాహనం.. స్తంభించిన ట్రాఫిక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.