విశాఖ జిల్లా సీలేరు నదిలో నాటుపడవ మునిగి ఇద్దరు గిరిజనులు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. మర్రిగూడేనికి చెందిన ఐదుగురు గిరిజనులు.. ఆంధ్రా సరిహద్దు ఒడిశా రాష్ట్రం సన్యాసి గుడాలో బంధువులు ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నాటు పడవ మీద సీలేరు నది దాటుతుండగా ప్రమాదం జరిగింది. తులా, సంజూ అనే ఇద్దరు గల్లంతవగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: