ETV Bharat / state

ఎన్నాళ్లీ నిరీక్షణ..? బోటు ప్రమాద బాధితులు ఆవేదన - boat accident family members meets rajamundry sub collector

కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా, తమ వారి జాడ దొరక్క కుటుంబ సభ్యులు అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. ఇంకా 15 మంది జాడ తెలియాల్సి ఉంది. బోటు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తే, మరో మారు ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతోనే..అధికార్లు బోటును వెలికి తీసేందుకు అనుమతి ఇవ్వడంలేదనే వాదన వినిపిస్తోంది.

ఇంకెన్ని రోజులు ఈ నిరీక్షణ?
author img

By

Published : Sep 23, 2019, 3:16 PM IST

ఇంకెన్ని రోజులు ఈ నిరీక్షణ?

కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు నిరీక్షణలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్నా, ఆచూకీ లేకుండా పోయిన వారి కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద...మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. గోదావరి తీరంలో వివిధ చోట్ల లభిస్తున్న మృతదేహాలు, గల్లంతైన వారివనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ 36 మృతదేహాలు లభ్యం కాగా, మరో 15 మంది జాడ తెలియాల్సి ఉంది. తాజాగా పట్టిసీమ వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు మరోసారి రాజమహేద్రవరం సబ్ కలెక్టర్ మహేశ్ కుమార్ ను కలిశారు. తమ వారి జాడను త్వరగా తెలియజేయాలని విన్నపించారు. బోటు వెలికితీయాలని బాధితులు వేడుకున్నా, అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతుందే తప్పా..బోటును కనీసం కదిపేందుకైనా ప్రయత్నించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది మత్స్యకారాలు బోటును వెలికితీస్తామని చెప్పినా, మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే అధికార్లు అనుమతి ఇవ్వడంలేదని భావిస్తున్నారు.

.

ఇదీ చదవండి: "తప్పంతా మా నాన్నదే అంటే ఎలా?... ఆయనది ప్రాణం కాదా?"

Intro:ap_atp_61_23_raithula_aandolana_av_ap10005
--------------*
వాతావరణ బీమా చెల్లించాలని బ్యాంకు ముందు రైతుల ఆందోళన.....
--------------*
తమకు రావాల్సిన వాతావరణ బీమా మొత్తాన్ని వెంటనే చెల్లించాలని రైతుల గ్రహించే బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు స్థానిక ఎస్బిఐ ముందు ఆందోళన నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలోనే తమకు అందించాలని ఈ సంవత్సరం సెప్టెంబరు నెల ఆఖరి అవుతున్న తమ మొత్తం అందలేదని నినాదాలు చేస్తూ బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం నాయకులు మద్దతు పలికారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్ చౌదరి సంబంధిత బ్యాంకు మేనేజర్ ను వాతావరణ బీమా విషయం అడుగగా జాబితా తయారు చేస్తున్నామని, జాబితా పూర్తయిన వెంటనే రైతులకు అందాల్సిన మొత్తాన్ని పంపిణీ చేస్తామని తెలపడంతో రైతులు శాంతించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.