తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన క్రమంలో భాజపా చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ తరుణంలో అమలాపురం వెళ్లిన భాజపా ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని ఖండిస్తూ వారు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు. అమలాపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు హెచ్చరించారు.
ఇవీ చదవండి...