తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జీ వరుపుల తమ్మయ్యబాబు ధర్నా చేశారు. ప్రభుత్వం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు... కేంద్రప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు... ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు గట్టెం రమణ జనసేన నాయకులు పెంటకోట మోహన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి. మాస్క్ వివాదం: చీరాల ఎస్సై దాడిలో యువకుడు మృతి