తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెం- తంటికొండ గ్రామాల మధ్య పోలవరం కాలువ గట్టుపై నిన్న రాత్రి అడవిదున్నను పోలిన జంతువు(గొర్రగేదె) సంచరించడాన్ని స్థానికులు చూశారు. ఈ విషయాన్ని గోకవరం అటవీశాఖ సెక్షన్ అధికారి శివప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హుటాహుటిన సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా కాలువ గట్టు చుట్టుపక్కల గ్రామాలైన పెదరమణయ్యపేట, గోపాలపురం, గాదెలపాలెం పరిసర ప్రజలు కాలువ గట్టుపై వెళ్లకుండా రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌టుడే’ తో మాట్లాడుతూ వేసవి కావడంతో దాహార్తి తీర్చుకోవడానికి కొండలపై సంచరించే గొర్రగేదెలు ఇలా కాలువల వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారన్నారు.
ఇదీ చదవండి: చిట్టిదూడ హొయలు... చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు