షోరూంలో ద్విచక్రవాహనాల అపహరణ - bike chori at east godavari dst p.gannavaram
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం ప్రధాన రహదారి పక్కన ఉన్న అనుశ్రీ యమహా షో రూంలో చోరీ జరిగింది. ఆర్15, ఎఫ్జెడ్ఎస్ మోడల్ గల 2 సరికొత్త ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని యాజమని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రల ఆనవాళ్లు ఇతర వివరాలు సేకరించారు.