తూర్పు గోదావరి జిల్లా ఆలమురులోని దేవి థియేటర్ సమీపంలో జొన్నాడ - కాకినాడ ఆర్అండ్బీ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఆలమూరు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి ఆలమూరు మండలం జొన్నాడలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా స్థానిక దేవి థియేటర్ సమీపంలో పెద్ద గోతుల్లో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో సూర్యనారాయణ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి