ETV Bharat / state

రెండో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

author img

By

Published : Feb 1, 2020, 9:14 PM IST

బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండో రోజుకు చేరింది. రోడ్లపైనే ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిబ్బంది నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల లావీదేవీలన్నీ స్తంభించిపోయాయి.

bank employees bundh continuing on 2nd day
రెండో రోజు కోనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా....నేడు విశాఖ జిల్లా నర్సీపట్నంలోని మెయిన్​ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.యాజమాన్యం అంగీకరించకపోతే మార్చి నెలలో 3రోజులు... ఏప్రిల్​లో నిరవధిక దీక్షలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా చీరాల ఆంద్రాబ్యాంక్ ముందు సిబ్బంది నినాదాలు చేశారు.. ఒప్పందం ప్రకారం 20 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు టౌన్​లో బ్యాంకు ఉద్యోగులు తమకు రావలసిన వేతన బకాయిలు, వేతన సవరణ సమస్యలకు సంబంధించిన డిమాండ్లపై రెండో రోజు ర్యాలీ నిర్వహించారు.

విజయవాడ భారతీయ స్టేట్ బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట బాంక్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 20 శాతం తక్షణ వేతన సవరణ ఇవ్వాలని.. బ్యాంకు నష్టాలను సాకుగా చూపి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.