ETV Bharat / state

సంపూర్ణ ఆరోగ్యం కోసం సైక్లింగ్ - cycling latest news update

గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు కాకినాడ సమీపంలోని యానాం బీచ్ లో యువతకు సైక్లింగ్ పై అవగాహన కల్పించారు. యువకులను ప్రోత్సహించేందుకు 40 సభ్యుల బృందం యానంలో పర్యటించింది.

Awareness on cycling for youth
యువతకు సైక్లింగ్ పై అవగాహన
author img

By

Published : Sep 27, 2020, 2:43 PM IST

వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం తగ్గాలన్నా.. యువత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం మంచిదని కాకినాడకు చెందిన గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నగరాల్లో సైక్లింగ్ ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమంలో 107 పట్టణాలు తమ ఆమోదాన్ని ప్రకటించాయన్నారు.

వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి, విశాఖపట్నం, తిరుపతితో పాటు కాకినాడ ఉండడం ఉందని తెలిపారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో యువకులను ప్రోత్సహించేందుకు 40 సభ్యుల బృందం పర్యటించింది. కాకినాడలో ఉదయం 5 గంటలకు సైక్లింగ్ చేస్తూ రాజీవ్ బీచ్ కు చేరుకున్నారు. యువకులకు సైక్లింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు వివరించారు.

ఇవీ చూడండి:

అంతర్వేది ఆలయ రథం నిర్మాణ పనులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.