ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విద్యార్థుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెల 19న ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తున్నాయో తెలుసుకున్న విద్యార్థులు స్వయంగా వస్త్ర సంచులను తయారుచేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని వస్త్ర సంచులను వాడాలని నినాదాలు చేస్తూ వారు తయారు చేసిన వస్త్ర సంచులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పలువురికి వస్త్ర సంచులు పంచిపెట్టి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు