కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీని లెక్కించారు. 26 రోజులకు రూ. 45.21 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం, 310 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీలను లెక్కించారు.
ఇవీ చూడండి...