రాజమహేంద్రవరం సమీపంలోని ఆర్య వైశ్య సేవా సదనం భూములు విక్రయించటాన్ని నిరసిస్తూ హిందూ ధర్మరక్షా సమితి, సాధు హిందు పరిషత్తు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వెలుగుబందలోని 32 ఎకరాల భూములు నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల స్థలాలకు విక్రయించారని ఆరోపించారు.
దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరంలోని ఆర్జేసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దేవాదాయ భూములు, దాతలు ఇచ్చిన భూములను విక్రయించొద్దని న్యాయస్థాన ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి