తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో జరిగిన సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాగర తీరంలో యుద్ధ నౌకల మోహరింపు, ఆకాశంలో హెలీకాఫ్టర్ల చక్కర్లు, వాటి పై నుంచి పారాచూట్ల సాయంతో మెరైన్ కమాండోలు దూకడం, నేలపై సైనిక దళాల మోహరింపు తదితర విన్యాసాలు యుద్ధ క్షేత్రాన్ని తలపించాయి. ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధ నౌక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
నౌకాదళ, సైన్యం విన్యాసాలు ఈరోజు ప్రారంభం కాగా.. సముద్రంలో పలు యుద్ధ విన్యాసాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. యుద్ధ విమానాలు వాయు వేగంతో చక్కర్లు కొడుతూ సంభ్రమాచ్ఛర్యాల్లో ముంచెత్తాయి. దాగి ఉన్న శత్రువులపై తుపాకులు, రాకెట్ లాంచర్లతో భారీ శబ్దాలు చేస్తూ కాల్పులు జరపడం.. బీఎంపీ యుద్ధ ట్యాంకులతో శత్రువుల్ని తుడముట్టించడం వంటి ఘటనలతో తీరం హోరెత్తింది. కరోనా నేపథ్యంలో విన్యాసాలు వీక్షించేందుకు ప్రజలకు అనుతించలేదు. 300 మంది పోలీసులతో రక్షణ చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: