ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఆమోదం - తూర్పు గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కుకు ఆమోదం

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరంపేట వద్ద రూ.1679 కోట్ల వ్యయంతో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన భేటీలో దీనికి పచ్చజెండా ఊపారు.

సీఎస్
author img

By

Published : Oct 22, 2019, 12:01 AM IST

రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ సమావేశం

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంలో 21 ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ(ఎస్ఎల్​ఈసీ) ఆమోద ముద్ర వేసింది. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ఆహార శుద్ధి సొసైటీకి సంబంధించిన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 21 ఆహార శుద్ధి పరిశ్రమల యూనిట్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు... వాటి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వాటిలో ముఖ్యంగా నూతన ఆహార శుద్ధికి సంబంధించిన 15 యూనిట్లు, ప్రైమరీ ప్రాసెసింగ్​కు సంబంధించిన ఒక యూనిట్​, కోల్డ్ చైన్​కు సంబంధించిన 2 యూనిట్లు, 2 టెక్నాలజీ అప్ గ్రేడేషన్​ యూనిట్లు, అదే విధంగా ఒక మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు సమావేశంలో ఆమోదం తెలిపారు.

ఈ ప్రాజెక్టుల్లో కృష్ణా జిల్లాల్లో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, చిత్తూరు జిల్లాల్లో కోల్డ్ ప్రెస్డ్ ఫ్రెష్ జ్యూస్ బాటిలింగ్ యూనిట్, ప్రూట్ పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, తూర్పు గోదావరి జిల్లాలో పోర్టిఫైడ్ రైస్ ప్రాసెసింగ్ యూనిట్, పామ్ ఆయిల్ రిఫైనరీ, గుంటూరు జిల్లాలో హెర్బల్ ఎక్స్​ట్రాక్ట్స్ ఆగ్రో కమోడిటీస్ యూనిట్, స్పైస్ ప్రాసెసింగ్ యూనిట్, మెంధాల్ ఎలైడ్ ప్రాజెక్టు, కడప జిల్లాలో పీనట్ ప్రాసెసింగ్ యూనిట్, విశాఖ జిల్లాలో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, కర్నూలు జిల్లాలో బొప్పాయి ప్రాసెసింగ్ యూనిట్, విజయనగరం జిల్లాలో బేకరీ యూనిట్ తదితర ప్రాజెక్టులున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరంపేట వద్ద 1679 కోట్ల రూపాయల వ్యయంతో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు కూడా రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది.

వివిధ ఆహార శుద్ధి పరిశ్రమలను కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నైపుణ్య శిక్షణ సంస్థ సమన్వయంతో నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించి ఆయా యూనిట్లలో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.