తూర్పుగోదావరి జిల్లాలో పని చేస్తున్న ఒడిశా కార్మికుల సమస్యలను పోలీసులు పరిష్కరించారు. సంధ్యా మెరైన్ అనే ఓ ప్రైవేట్ సంస్థలో దాదాపు ఇరవై మంది మహిళలు పని చేస్తున్నారు. వారిని కాంట్రాక్టర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేయటం, కమిషన్ ఎక్కువగా తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌కు తెలిపారు. వారి గోడును విన్న ఎస్పీ.. స్వయంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి.. కార్మికులకు రావాల్సిన సొమ్మును ఇప్పించారు. వారు ఒడిశా వెళ్లేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టరుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తమ సమస్యలపై స్పందించి.. వారికి న్యాయం చేసిన ఏపీ పోలీసులకు.. కార్మిక మహిళలు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: కనుమదారులను పరిశీలించిన జేఈవో సదా భార్గవి