తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ఆరోపించారు. అమరావతిలో రైతులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పవన్‌కు ఏమాత్రం అవగాహన లేదని... ఇకనైనా జనసేనాని నటనలు ఆపాలని ఎద్దేవా చేశారు. 16 నెలల జైలు అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కార్యక్రమంగా జనసేనాని పెట్టుకున్నారని ఆక్షేపించారు. రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.
ఇవీ చూడండి: