నేటి నుంచి పాపికొండల పర్యాటకం ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద మంత్రి ముత్తంశెట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2019 కచ్చులూరు వద్ద జరిగిన ఘరో బోటు ప్రమాదం తర్వాత పాపికొండలు పర్యటనను నిలిపివేశారు.
అసలు మే నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేందుకు అధికారులు ఏప్రిల్ 15న ట్రయల్ రన్ నిర్వహించారు. కరోనా రెండో దశ విజృంభించడంతో బోటు ప్రయాణాలను నిలిపివేశారు.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని 2019 సెప్టెంబర్ 15న జరిగిన పడవ ప్రమాదంలో 51 మంది పర్యాటకులు మృతి చెందారు. పర్యాటక శాఖ అప్పటినుంచి పాపికొండల యాత్రను నిలిపివేసింది. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. ఇన్నాళ్లకు మళ్లీ మొదలుకాబోతోంది.
పాపికొండల యాత్రలో గోదావరి నది అందాలతో పాటు పట్టిసీమ, పోలవరం, గండిపోచమ్మ ఆలయం, భద్రాచలం, మారేడుమిల్లి, దేవీపట్నం వంటి పర్యాటక ప్రాంతాలు దర్శనమిస్తాయి.
ఇదీ చదవండి: