కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో....మరొకరి మృతదేహం లభ్యమైంది. కచ్చులూరు సమీపంలో తేలిన మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం దేవీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ మొత్తం 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 15 మంది జాడ తెలియాల్సిఉంది. ప్రమాదం జరిగినేటికి ఏడు రోజులు కాగా...నేటి గాలింపు చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పోస్టుమార్టం కోసం వేసిన టెంట్లు, హెల్ప్‌డెస్క్ తీసివేశారు. మరో మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఆసుపత్రికి రావడం వలన తిరిగి ఆసుపత్రిలో ఓ టెంట్ వేశారు.
ఇదీ చదవండి :
బోటు ప్రమాదంలో గల్లంతైన మరో చిన్నారి మృతదేహం లభ్యం