ETV Bharat / state

శనివారం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు

అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలను శనివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగించనున్నట్లు... వ్రతాలు, ఇతర ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని ఆయన వివరించారు.

annavaram temple darshans reopens on saturday says temple eo trinathrao
శనివారం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు పునఃప్రారంభం
author img

By

Published : Aug 13, 2020, 11:31 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు శనివారం నుంచి యధావిధిగా ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. దేవస్థానం ఉద్యోగుల్లో చాలా మందికి కరోనా సోకడంతో ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించారు.

అయితే కరోనా వ్యాప్తి చెందకుండా మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని, సిబ్బంది విధులు కుదించి భక్తులకు దర్శనాలు కొనసాగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగించాలని నిర్ణయించారు. వ్రతాలు, ఇతర ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:

'ప్రలోభాలు, బెదిరింపులు జస్టిస్ ఈశ్వరయ్యకు తగవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.