2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.16 లక్షల మిగులుతో అన్నవరం దేవస్థానం బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్ రోహిత్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఈవో త్రినాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.101కోట్ల 20లక్షల 50 వేలు నికర ఆదాయం కాగా.. రూ.101కోట్ల 4లక్షల 50వేలు ప్రతిపాదిత వ్యయంగా చూపించారు. వ్యయంలో చట్టపరమైన చెల్లింపులు, కొత్త పెట్టుబడులు తీసివేయగా రూ.89కోట్ల 4లక్షల 50వేలు నికర ఖర్చుగా చూపారు. గోసంరక్షణకు రూ.68.30 లక్షల ఆదాయం, రూ.47 లక్షలు వ్యయంగా బడ్జెట్ సిద్ధం చేశారు.
ఇదీ చూడండి.