ETV Bharat / state

లాక్​డౌన్​ తర్వాత... సత్యదేవుని దర్శించుకోవాలంటే...!

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ముందు జాగ్రత్తలకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిత్యాన్నదానంలో మార్పులు చేస్తున్నారు. స్వామివారి నిత్య సేవల్లో భక్తులు పరోక్షంగా పాల్గొనేలా కసరత్తు చేశారు.

annavaram satyanarayana swamy temple
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం
author img

By

Published : May 11, 2020, 11:44 AM IST

కరోనా ప్రభావం నేపథ్యంలో ఇకపై అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ప్యాకెట్ల రూపంలో ఆహారం అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. సామాజిక దూరం పాటంచేలా జాగ్రత్తలు తీసుకోవడం కష్టమయ్యే పరిస్థితుల్లో ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించాలని భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం దర్శనాలకు భక్తులను అనుమతించేలా అదేశాలొస్తే కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవస్థానం అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు.

దేవస్థానంలో నిత్యం జరిగే వ్రతాలు, నిత్య కల్యాణం, ఆయుష్య హోమం, చండీ హోమాలకు భక్తులు ఆన్​లైన్ ద్వారా రుసుము చెల్లిస్తే, వారి పేరు మీద పూజ చేసి పరోక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. లాక్​డౌన్ అనంతరం ఇలా పూజ చేయించుకునే భక్తులకు ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. టోల్ గేట్ వద్ద, మెట్ల మార్గం, ప్రధానాలయం వద్ద డిస్ ఇన్ఫెక్షన్ టన్నల్, శానిటైజర్ స్టాండ్​లు ఏర్పాటు చేయడంతో పాటు థర్మల్ స్కాన్ ద్వారా పరీక్షించి కొండపైకి అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చూడండి:

ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించారు.. సస్పెండయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.