అన్నవరం దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, పూజలను భక్తులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆరో తేదీ ఆదివారం నుంచి ఈ సేవలను భక్తులు లైవ్‌లో వీక్షించవచ్చు. కరోనా కారణంగా భక్తులు అన్నవరం వచ్చి ప్రత్యక్షంగా పూజల్లో పాల్గొనే అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా సత్యదేవుని వ్రతం నిర్వహిస్తున్నారు. మూలవిరాట్టుకు జరిగే అభిషేకం మినహా మిగతా సేవలు, పూజలు ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. నిత్యం జరిగే ఆయుష్య హోమం, కల్యాణం, వ్రతాలు, క్షేత్ర రక్షకులు వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే చండీహోమం, పౌర్ణమి రోజున జరిగే ప్రత్యంగిర హోమం, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మూలనక్షత్రం రోజున జరిగే చండీహోమం, ఆదివారం నాడు జరిగే సూర్యనమస్కారాలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశముంది. ఆయా పూజలను వీడియో కెమెరాలతో చిత్రీకరించి యూట్యూబ్‌కు అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా రుసుం చెల్లించే భక్తులకు ఈ యూట్యూబ్ లింక్ పంపిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా స్టూడియోను సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: