కోడి పందేల కారణంగా కారణంగా భారీ ట్రాఫిక్ జాంతో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో పేరవరంలో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఆత్రేయపురం మండలంలోని బొబ్బర్లంక సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వెంకట్రావు కాలు విరిగింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. పేరవరం వద్ద కోడిపందేలు జరుగుతుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ముందుకు వెళ్లలేక.. వెనక్కి పోలేకా మూడు గంటల సేపు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది. పోలీసు సిబ్బంది ఎవరూ లేకపోవండంతోనే ట్రాఫిక్ జాం ఏర్పడిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కో'ఢీ' కొడుతుందా.. ? పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా..?