ETV Bharat / state

ఎక్సైజ్ మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన.. వైకాపా కౌన్సిలర్​పై కేసు - అమలాపురంలో తెలంగాణ మద్యం

అక్రమ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారి ఫిర్యాదుపై తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు వైకాపాకు చెందిన కౌన్సిలర్​పై కేసు నమోదు చేశారు. తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడంతో.. వారితో దురుసుగా ప్రవర్తించాడు.

Amalapuram police have registered a case against  ysrcp councilor following a complaint by an excise officer
మద్యం పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Apr 9, 2021, 11:05 AM IST

ఎక్సైజ్ ఎస్సై అయినా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైకాపాకు చెందిన కౌన్సిలర్​పై తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు కేసునమోదు చేశారు. అమలాపురానికి చెందిన కోడూరు సత్యదుర్గాప్రసాద్ తెలంగాణ నుంచి 560 మద్యం సీసాలను.. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రప్పించాడు. అమలాపురానికి వచ్చిన ఆ మద్యం సీసాలను దుర్గాప్రసాద్ జీపులలో తీసుకెళ్తుండగా.. ఎక్సైజ్ అధికారులకు తనిఖీలు నిర్వహించారు. దుర్గాప్రసాద్​తో పాటు జీపుని, మద్యం సీసాలను వారు స్టేషన్​కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక వైకాపాకు చెందిన కౌన్సిలర్ దొమ్మేటి రాము.. ఎక్సైజ్ ఎస్సై విజయలక్ష్మి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి. దూసనపూడి సర్పంచ్‌పై అర్ధరాత్రి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.