ETV Bharat / state

డ్రగ్స్ అంశంలో నాపై వస్తున్న ఆరోణలపై విచారణ చేపట్టాలి: అలీషా - ఆంధ్రప్రదేశ్ న్యూస్

డ్రగ్స్ అంశంలో తనపై వస్తున్న ఆరోణలపై విచారణ చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకి అలీషా వినతిపత్రం ఇచ్చారు. ఆషీ సంస్థ, మాచవరం సుధాకర్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. షిప్పింగ్ సేవలు మినహా ఎగుమతి, దిగుమతులతో సంబంధం లేదని పేర్కొన్నారు.

Alisha
Alisha
author img

By

Published : Oct 7, 2021, 3:56 PM IST

Updated : Oct 7, 2021, 7:18 PM IST

డ్రగ్స్ అంశంలో నాపై వస్తున్న ఆరోణలపై విచారణ చేపట్టాలన్న అలీషా

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాన్‌ మెరైన్‌ ఎండీ అలీషా.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అఫ్గానిస్థాన్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు దిగుమతైన డ్రగ్స్‌ వ్యవహారంలో.. ఇటీవల అలీషాపై ఆరోపణలు వచ్చాయి. విజయవాడ అడ్రస్‌తో వచ్చిన డ్రగ్స్‌తో అలీషాకు సంబంధం ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, ఎవరి పాత్ర ఉందో నిగ్గు తేల్చాలని ఎస్పీ కార్యాలయ అధికారులను అలీషా కోరారు.

''నేను ఎస్పీ గారిని కలిసి వాలంటరీగా నాపై విచారణ జరపాలని కోరాను. డ్రగ్స్ వ్వవహారంలో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాను. డ్రగ్స్ విషయంలో మా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలకు రవాణా సేవలు అందించడం తప్ప మాకు వేరే వ్యాపార వ్యవహారాలు లేవు. అనవసరంగా మమ్మల్ని బలిపశువులు చేసే ప్రయత్నాలు సరికాదు. దీనిపై ఇద్దరికి డిఫర్మేషన్ నోటీసులు ఇచ్చాం.'' - అలీషా, శాన్ మెరైన్ సంస్థ నిర్వాహకుడు

ఇదీ చదవండి: మహిళల హత్య కేసులో నిందితుడికి 160 ఏళ్ల జైలు!

Last Updated : Oct 7, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.