తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేయొద్దంటూ ఆందోళన చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు.
ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గాంధీ కూడలిలో మానవహారం నిర్వహించారు. రహదారిపై విద్యార్థుల ధర్నాతో కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇదీ చూడండి. 'అసలు దొంగలను వదిలేసి.. అమాయకులను బలిచేశారు'