Bull Race Competition at Velugubanda: తూర్పు గోదావరి జిల్లా వెలుగుబంధ గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎడ్లబండి ముందు వెళ్తున్న వీడియో గ్రాఫర్ బైక్ అదుపుతప్పి కిందపడింది. వెనకున్న ఎడ్లబండి బైక్ మీదగా వెళ్లి తిరగబడింది.
ఈ ఘటనలో పోటీదారులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు ఎడ్లబండిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి..
ONGOLE BULLS: బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు