తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో... జగన్ ఏడాది పాలన పై నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ వరుపుల రాజా... విధ్వoసానికి ఒక్క ఛాన్స్ పేరిట పుస్తకం విడుదల చేశారు. ఏడాది పాలనలో జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు. విద్యుత్, ఇసుక, నిత్యావసరాలు, సిమెంట్, మద్యం ధరలు విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలు, రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పెన్షన్ 200 నుంచి 2000 వరకు పెంచితే 3000 చేస్తానని అధికారంలోకి వచ్చాక 250 మాత్రమే పెంచారని పేర్కొన్నారు.
విధ్వంసానికి ఒక్క ఛాన్స్.. జగన్ ఏడాది పాలన పై పుస్తకం - ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి వరుపుల రాజా
ప్రత్తిపాడులో జగన్ ఏడాది పాలన పై నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ వరుపుల రాజా.. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరిట పుస్తకం విడుదల చేశారు.