- తీరు మార్చుకోకపోతే, టిక్కెట్లు కష్టమే.. ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరిక
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన వైసీపీ MLAలకు.. ముఖ్యమంత్రి జగన్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేశారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'విజన్-2020' కల సాకారం.. నెక్ట్స్ టార్గెట్ 2029: టీడీపీ అధినేత చంద్రబాబు
హైదరాబాద్‌లో ఐఎస్‌బీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు.. ఐఎస్‌బీ విద్యార్థులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాచర్లలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలపై దాడి
పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో వైకాపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని తెదేపా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కర్రలతో తెదేపా వారిపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారిపై తిరగబడ్డారు. రాళ్లతో ప్రతిదాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి కాాకాణి ఫోర్జరీ కేసు.. విచారణ మొదలుపెట్టిన సీబీఐ
నెల్లూరు కోర్టులో ఫోర్జరీ పత్రాల చోరీకి సంబంధించి.. సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఒక ఎస్పీ స్థాయి అధికారి, ముగ్గురు సిబ్బందితో కూడిన బృందం నెల్లూరు చేరింది. చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారులు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో కొందరు పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోంది'.. రాహుల్ ఫైర్!
మన దేశంపై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భుట్టో వ్యాఖ్యలపై భగ్గుమన్న భాజపా.. భారత్‌ను చూసి ఓర్వలేకే అంటూ..
పాకిస్థాన్ మరింత దిగజారింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విషం కక్కిన దాయాది దేశం.. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో పాతాళానికి పడిపోయింది. లాడెన్ సహా ఉగ్రవాదులకు దేశాన్ని స్వర్గధామంలా మార్చిన పాక్.. ఐరాసలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో భారత్ భగ్గుమంది. దాయాది దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భీకర దాడి.. 60కిపైగా క్షిపణుల ప్రయోగం.. ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్, ఖార్కివ్ సహా నాలుగు నగరాలపై 60కిపైగా క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణంలో క్షిపణి దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఖార్కివ్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే'.. ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ పరిణామాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడిన దిగువ మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి రాజన్ సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఎన్నాళ్లో వేచిన ఉదయం'.. 52 ఇన్నింగ్స్.. 1,443 రోజులు.. పుజారా సెంచరీ సాధించేశాడోచ్!
ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. స్టార్ ప్లేయర్లు కూడా జట్టులోస్థానం కోల్పోయి కనుమరుగవుతుంటారు. అయితే పుజారా మాత్రం పడిన చోటే లేచి నిలబడి.. తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఫామ్ కోసం పడిన కష్టానికి సరైన ఫలితం పొందాడు. 1,443 రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అవతార్-2 కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించా.. ఆయనలా ఆగిపోదామనుకున్నా'
అవతార్2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కోసం జేమ్స్ కామెరూన్ ఎంత కష్టపడ్డారో చెప్పారు. అవతార్ సీక్వెల్ విషయంలో చాలా ఆలోచించానని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.