తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 44వ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.... వయసుతో సంబంధంలేని క్రీడ బ్యాడ్మింటన్ అన్నారు. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడా పర్యటక సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. డిసెంబరు 31వరకూ ఈ పోటీలు జరగనున్నాయి. ఉత్తరాఖాండ్, మణిపూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి.
ఇదీ చూడండి