ETV Bharat / state

ప్రమాదానికి గురైన బోటులో.. 31 మంది తెలంగాణ వాసులు! - warangal residents in godavari boat accidents

తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదానికి గురైన బోటులో తెలంగాణకు చెందిన 31 మంది ఉన్నారు. హైదరాబాద్​కు చెందిన 22 మంది, వరంగల్​కు చెందిన గొర్రె ప్రభాకర్​ సహా 9 మంది బృందం బోటులో ఉంది.

31 telangana residents on board the godavari boat accident
author img

By

Published : Sep 15, 2019, 6:48 PM IST

ప్రమాదానికి గురైన బోటులో 31 మంది తెలంగాణ వాసులు

తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో ప్రమాదానికి గురైన పడవలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొత్తం 31 మంది పర్యాటకులు ఉన్నారు. హైదరాబాద్​కు చెందిన 22 మంది పర్యటక బృందం బోటులో ఉన్నారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ ప్రాంతానికి చెందిన గొర్రె ప్రభాకర్ సహా 9 మంది కూడా బోటులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో వరంగల్​ వాసులు గొర్రె ప్రభాకర్​, కొమ్మల రవి, సిద్ది వెంకట స్వామి, బాస్కె దశరథములు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బోటులో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడం ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. గోదావరిలో పాపికొండల విహారానికి 62 మందితో వెళ్లిన పర్యటక బోటు ప్రమాదానికి గురైంది.

ఇదీ చూడండి:

ప్రమాద సమాచారం కావాలంటే.. ఈ నంబర్​కు ఫోన్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.